పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటూ సీఎం జగన్‌ మోసం చేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ

-

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తానంటూ గతంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్… ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటూ మోసం చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సీఎం అయినప్పటి నుంచి ఒక్కో ఏడాది గడువు పెంచుకుంటూ వచ్చిన జగన్… ఇప్పుడు 2025కి పోలవరం పూర్తవుతుందని చెపుతున్నారని దుయ్యబట్టారు. 2025 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారా? అని ఎద్దేవా చేశారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం పోలవరం పూర్తి కాదని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాన్ని వైఎస్సార్, చంద్రబాబు చేయలేదని… ఎత్తు తగ్గించే పని జగన్ చేస్తున్నారని విమర్శించారు.

అమరావతిని ధ్వంసం చేసినట్టే పోలవరంను కూడా చేస్తున్నారని అన్నారు. ఈ నెల 23న పోలవరంపై ఏలూరులో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉండగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పుకొచ్చారు రామకృష్ణ. 150 అడుగుల ఎత్తు ఉండాలని వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి , చంద్రబాబు ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచన చేయలేదని చెప్పుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలవరం ఎత్తు తగ్గించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మండిపడ్డారు. అమరావతిని ధ్వంసం చేసినట్లే పోలవరం ప్రాజెక్టును జగన్ నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 

ఈనెల 23న ఏలూరులో పోలవరంపై నిరసన చేపడతామని ప్రకటించారు. మరోవైపు మెడికల్ కాలేజీ సీట్లపై కీలక వ్యాక్యలు చేశారు. మెడికల్ కాలేజీలో సీట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లకే గండి కొడుతుంటే ప్రైవేటు కాలేజీల పరిస్థితి ఘోరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version