బిఆర్ఎస్ పార్టీని సిపిఐ స్వాగతిస్తోందని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూణంనేని సాంబశివరావు. బిజెపికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తర్వాత పోరాడే వ్యక్తి కెసిఆర్ మాత్రమే అన్నారు. అనేక అంశాలపై కేసీఆర్ కు అవగాహన ఉందన్నారు. కొన్ని అంశాలలో మేము వ్యతిరేకించిన మాట వాస్తవమే కానీ.. అన్ని రంగాలలో తెలంగాణ బాగుపడుతుందన్నారు కూనంనేని. దేశవిచ్చిన శక్తులైన బిజెపి వంటి పార్టీలను వ్యతిరేకించే పార్టీలకు మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందన్నారు.
ఇప్పుడున్న బిజెపికి, వాజ్పేయి బిజెపికి చాలా తేడా ఉందన్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు కూనంనేని. అమెరికా తరహాలో అధ్యక్ష విధానం తేవడానికి మోడీ చూస్తున్నారని అన్నారు. ఈడి, సిబిఐ, ఎలక్షన్ కమిషన్లను బిజెపి దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందని.. ఇలాగే ఉంటే శ్రీలంక లాగా దేశం మారుతుంది అన్నారు. ఉద్యోగాలు లేవు కానీ.. ఉన్నవి ఊడగొడుతున్నారని మండిపడ్డారు. ఆఫ్రికన్ కంట్రీస్ కూడా చాలా రంగాలలో మనకంటే ముందున్నాయన్నారు.