సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెంటనే పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో జీవించే అర్హత ఆయనకు లేదు. అక్కడి ప్రజలతో నారాయణ జీవించాలి.
దేశంలో ఇంత ఘోరం జరిగితే యుద్ధం వద్దంటాడా? యుద్ధం చేయాలని దేశ ప్రజలంతా ఆవేశంతో ఉంటే యుద్ధం వద్దంటాడా? సీపీఐ పార్టీ నుంచి నారాయణను సస్పెండ్ చేయాలి’ అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు.ఇదిలాఉండగా, ఇటీవల సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల మీద భారత ఆర్మీ దాడిని సమర్థిస్తున్నామన్నారు. కానీ, పాక్ తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, దానికి వ్యతిరేకం అని అన్నారు.