గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గురునానక్ వర్సిటీ హాస్టల్‌లో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కురనవెళ్లికి చెందిన అల్లూరి శశిరెడ్డి, ఆయన భార్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు. భావన(22) రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలోని గురునానక్ వర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తుంది. మరో అమ్మాయి జూబ్లీహిల్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. అయితే, భావన శనివారం ఉదయం 10 గంటలకు హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు.