సీపీఎల్ 2020 6వ మ్యాచ్‌.. జ‌మైకాపై నైట్ రైడ‌ర్స్ విక్ట‌రీ..

-

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జ‌రిగిన క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్‌) టీ20 6వ మ్యాచ్‌లో జ‌మైకా త‌ల్లావాహ్స్‌పై ట్రింబాగో నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన నైట్ రైడ‌ర్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా జ‌మైకా బ్యాటింగ్ చేసింది.

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో జ‌మైకా 8 వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టులో జీడీ ఫిలిప్స్ (42 బంతుల్లో 58 ప‌రుగులు, 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఒక్క‌డే ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ల‌లో అలీఖాన్‌, జేఎన్‌టీ సీల్స్‌లు చెరో 2 వికెట్లు తీశారు. సునీల్ న‌రైన్‌, ఫ‌వాద్ అహ్మ‌ద్‌, బ్రేవోలు త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు 18.1 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో సునీల్ న‌రైన్ (38 బంతుల్లో 53 ప‌రుగులు, 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), మున్రో (46 బంతుల్లో 49 ప‌రుగులు, 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు విజృంభించారు. జ‌మైకా బౌల‌ర్ల‌లో ఎడ్‌వార్డ్స్‌, ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్‌, ల‌మిచ్చ‌నెలు త‌లా 1 వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version