Ram Charan: RC15‌కు క్రేజీ టైటిల్..సినిమాలో శంకర్ మార్క్

-

మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, పవర్ ఫుల్ అండ్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ పైన హోప్స్ ఏర్పడ్డాయి.

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 15 వ చిత్రం చేస్తున్నారు. ఈ RC15 పిక్చర్ కు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని లీక్స్ వచ్చేశాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. IAS ఆఫీసర్ తో పాటు IPS ఆఫీసర్ గా నూ రామ్ చరణ్ కనిపించనున్నారట.

తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ పిక్చర్ కు ‘సర్కారోడు’ అనే టైటిల్ ను డైరెక్టర్ శంకర్ కన్ఫర్మ్ చేసినట్లు టాక్. ఈ ఫిల్మ్ కు కార్తీక్ సుబ్బరాజ్ స్టోరి అందించినప్పటికీ మూవీలో శంకర్ మార్క్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మూవీ షూటింగ్ 60 శాతం పూర్తయింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version