సర్కారు వారి పాట: మహేష్ కోసం అక్కడ బ్యాంకు దొరికేసింది..

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారి వారి పాట పేరుతో సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా చిత్రీకరణ మొదలుపెట్టని ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. బ్యాంకు మోసాల నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బ్యాంకు సెట్ చేస్తున్నారని వినిపించింది. ఐతే తాజా సమాచారం ప్రకారం అదంతా వట్టి మాటలే అన్ని తేలింది.

అమెరికాలో చిత్రీకరన జరుపుకోనున్న ఈ సినిమాకి బ్యాంకు సెట్ వేయడం లేదట. చికాగోలో ఒకానొక బ్యాంకు వారి నుండి చిత్రీకరనకి అనుమతి లభించిందట. సెట్లో కన్నా ఒరిజినల్ ప్లేస్ లో చిత్రీకరన జరిపితే ఆ ఇంపాక్ట్ వేరుగాఉంటుందన్న ఉద్దేశ్యంతో దర్శకుడు బ్యాంకుని ప్రిఫర్ చేసాడట. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ లుక్ కి మంచి స్పందన వచ్చింది కూడా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version