ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జ్యూడీషియల్ కాంప్లెక్స్ లోని అంతర్గత పనులు, ఫర్నీచర్, ప్రహరీ నిర్మాణం, పార్కింగ్ సదుపాయాలు తదితర పనుల కోసం ఏపీసీఆర్డీఏ టెండర్లను పిలిచింది. ఈ పనులకు అయ్యే ఖర్చుని రూ. 64 కోట్లుగా అంచనా వేసి ప్యాకేజీ – 2 కింద వీటిని పిలిచింది. డిసెంబర్ 15 లోగా తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశానుసారం సీఆర్డీఏ పనులను వేగవంతం చేసింది.