క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు ఈ విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు..

-

ప్రస్తుత కాలంలో డబ్బు చాలా ఈజీగా దొరుకుతుంది. ఇంతకుముందు ఎవరైనా రూపాయి ఇవ్వడానికి ఇబ్బంది పడేవారు. ఇప్పుడు బ్యాంకులు పిలిచి మరీ లోన్లు ఇస్తున్నాయి. వాటిల్లో ఎంత వరకు బ్యాంకులకి రిటర్న్ అవుతున్నాయనేది పక్కన పెడదాం. ఈ లోన్ల విషయంలో బడా కార్పోరేటర్ల గురించి పక్కన పెడితే సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారు లోన్ అనో, హౌసింగ్ లోన్ అనో రకరకాల లోన్లు తీసుకుంటూ ఆ తర్వాత కట్టలేక ఇబ్బంది పడే సందర్భాలు అనేకం.

ఐతే ఈ విధంగానే క్రెడిట్ కార్డుల వాడకం కూడా బాగా పెరుగుతుంది. బ్యాంకులు ఇచ్చేస్తున్నాయి కదా అని చెప్పి క్రెడిట్ కార్డు తీసేసుకోవడం, ఖర్చు పెట్టవచ్చు కదా అని చెప్పి విరివిగా వాడేయడం అలవాటయ్యింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, చాలా మంది ఖర్చు పెట్టడమే ఆలోచిస్తారు తప్ప మళ్ళీ కట్టాల్సి ఉంటుందని, కట్టకపోతే ఇబ్బందులు వస్తాయని ఆలోచించరు. క్రెడిట్ వాడే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది.

మీకు నిజంగా క్రెడిట్ కార్డ్ అవసరం అనుకుంటేనే తీసుకోండి. ఆఫర్లు వస్తున్నాయన్న ఆశతో తీసుకోవద్దు. బిల్లు గడువు తేదీ ముగియకముందే పేమెంట్ చేయాలి. ఒక్కరోజు మర్చిపోయినా ఫలితం ఘోరంగా ఉంటుంది. బిల్లు వచ్చే వరకు మీరెంత కట్టగలరో అంతే కట్టండి. క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలని చెప్పి అప్పులు చేయవద్దు. కార్డ్ ని ఉపయోగించి డబ్బులు తీసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఈఎమ్ఐ లలో కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ క్రెడిట్ కార్డును ఇతరులకు ఇవ్వకుండా ఉండడమే బెటర్. మీ కార్డ్ సమాచారం ఎవ్వరితో పంచుకోవద్దు.

మీ కార్డ్ లిమిట్ ఎంత ఉన్నా అందులో 40శాతం మాత్రమే ఖర్చు చేసేలా చూసుకోండి. రెండు కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులని వాడకపోవడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version