సాగర్ లో కేంద్ర మంత్రులు దిగుతారా…?

-

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసే వాళ్ల విషయంలో స్పష్టత రావడం లేదు. అయితే బీజేపీ తరపున ప్రచారం చేయడానికి కొంత మంది కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగవచ్చు అనే అభిప్రాయం ఉంది. వాస్తవానికి నాగార్జునసాగర్ లో సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి బలంగా ఉండటంతో టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగారు.

bjp

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వంటి వాళ్లు కూడా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. అవసరమైతే రాహుల్ గాంధీ కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఇటు తెలంగాణ కూడా వచ్చి నాగార్జునసాగర్ లో ఒక రోజు ప్రచారం చేసే అవకాశం ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ఇక బీజేపీ అగ్రనేతలు కొంతమంది నాగార్జునసాగర్ లో ప్రచారం చేయడానికి ఇప్పటికే మార్గం కూడా చేసుకున్నారని సమాచారం.

రాష్ట్ర పార్టీ నేతలు కొంతమంది కేంద్ర మంత్రులను రావాలని కోరారు అని కూడా అంటున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎక్కువగా ప్రచారం చేయాలి. లేకపోతే ఓడిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. కొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. జానారెడ్డి ఎదుర్కోవడానికి ఇప్పుడు బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కష్టపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version