సూయజ్ కాలువకు అడ్డుగా ఇరుక్కున దిగ్గజ కార్గో షిప్ సిబ్బంది మొత్తం అందరూ భారతీయులే అట. ఈ ఎవర్ గివెన్ కార్గో షిప్ లో ఉన్న సిబ్బంది అందరూ భారతదేశం నుండి వచ్చారని ఈ ఓడ యొక్క యజమాని జపాన్ కి చెందిన షోయి కిసెన్ కైషా తెలిపారు. ఎవర్ గివెన్‌ను నిర్వహించే సంస్థ బెర్న్‌హార్డ్ షుల్టే షిప్ మ్యానేజ్మెంట్, ఓడలో 25 మంది సభ్యుల సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తమతో వారంతా టచ్ లోనే ఉన్నారని చెప్పారు.
సూయజ్ కెనాల్ అథారిటీ జలమార్గాల వెంట ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది, కొంతమంది నిపుణులు బిలియన్ డాలర్ల వ్యయంతో కాలువను క్లియర్ చేయడానికి చాలా రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. 120 మైళ్ల ఇరుకైన సూయజ్ కాలువ ఒడ్డున బలమైన గాలులతో ఓడ అడ్డుగా చిక్కుకుంది. 200,000 టన్నులకు పైగా ఉన్న ఈ నౌక చైనా నుండి రోటర్‌డ్యామ్‌కు వెళుతుండగా బలమైన గాలుల వలన సిబ్బంది ఓడపై నియంత్రణ కోల్పోయారు.