రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠాని అరెస్టు చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటి, చైతన్యపురి పోలీసులు. వారి వద్ద నుండి 20 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్లో ఉన్న 1.3 కోట్ల రూపాయలు, 7 మొబైల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠాని ఆరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుండి 20 లక్షల నగదుతో పాటు వివిధ బ్యాంకులలో ఉన్న 1.42 కోట్ల నగదు స్వాదినం చేసుకున్నామన్నారు. క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసినట్లు తెలిపారు సిపి. నిందితులు జగదీశ్, జక్కి రెడ్డి అశోక్ రెడ్డి, వోడుపు చరన్ లను ఆరెస్ట్ చేసామన్నారు. హర్యానా నుండి ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిఎస్ చౌహన్. ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే నకిలీ ఎజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.