విశాఖలో క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు : భారీ మొత్తంలో డబ్బులు స్వాధీనం

-

విశాఖలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావం తో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మాధవ ధార లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మూట గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీసులు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు.

ప్రభాకర్ దగ్గర నుంచి ఒక ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు, రెండు చెక్ బుక్ లు, 2 ఏటీఎం కార్డులు, 88 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరం లో మ రి కొం త మంది ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు.

నిందితుడు ప్రభాకర్ ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన బుకిలను పట్టుకొని పనిలో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు మొదలు పెట్టాయి. కాగా టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా టీమిండియా మరియు పాకిస్థాన్‌ జట్ల మధ్య ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఈ మ్యాచ్‌ లో ఎవరు గెలుస్తారని… ఇరు దేశాల ప్రజలు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version