దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా… ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
కడలూరు జిల్లా లో పదవ తరగతి బాలికపై లైంగిక దాడి జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ ఇంటి కి బర్త్డే పార్టీకి వెళ్లిన ఆ బాలిక ను మరో ఇద్దరు విద్యార్థులు అత్యాచారం చేశారు. బాలిక ఫోటోలు అలాగే వీడియోలు తీసి బెదిరించారు.
ఇంటికి వచ్చిన బాలిక ప్రవర్తనలో మార్పు చూసి.. తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. ఆ కామాంధులపై కూతురుతో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.