భర్త లింగమార్పిడి చేసుకోవడం తో మరో యువకుడితో సహజీవనం…చివరికి..!

-

భ‌ర్త లింగ‌మార్పిడి చేసుకోవ‌డంతో మ‌రోయువ‌కుడితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. ఇంత‌లోనే అనుమానాస్ప‌ద రీతిలో ఆ ఇద్ద‌రూ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఏలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…బీడీ కాల‌నీలో నివాసం ఉంటున్న సుధారాణి అనే మ‌హిళ కొంత కాలంగా డింపుల్ కుమార్ అనే యువ‌కుడితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. సుధారాణికి ఇప్ప‌టికే వివాహం కాగా ఆమె భ‌ర్త రికార్డింగ్ డ్యాన్సులు నిర్వ‌హిస్తూ ఉండేవాడు. అయితే పెళ్లి త‌ర‌వాత ఇద్ద‌రు సంతానం త‌ర‌వాత భ‌ర్త లింగ‌మార్పిడి చేసుకుని సుధారాణికి దూర‌మ‌య్యాడు.

దాంతో సుధారాణి స్థానికంగా ఉంటున్న డింపుల్ కుమార్ అనే యువ‌కుడితో సంబంధం పెట్టుకుంది. అప్ప‌టి నుండి ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ మ‌ద్యానికి బానిస‌లైన‌ట్టు తెలుస్తోంది. సుధారాణి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను త‌న త‌ల్లి వ‌ద్ద ఉంచి యువ‌కుడితోనే ఉంటుంది. కాగా శుక్ర‌వారం రాత్రి ఇద్ద‌రూ క‌లిసి భ‌య‌ట తిరిగి రాత్రి తిరిగివ‌స్తున్న క్ర‌మంలో మూల మ‌లుపు వ‌ద్ద కింద ప‌డిపోయారు. ఇద్ద‌రికి గాయాలు కాగా సుధారాణి అక్క‌డే మృతి చెందింది దాంతో యువ‌కుడు భ‌యంతో ఇంటికి వెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version