ఆర్సీబీ కి కొత్త కోచ్.. డివిలియ‌ర్స్ షాకింగ్ నిర్ణ‌యం?

-

ద‌క్షిణాఫ్రిక జ‌ట్టు క్రికెట్ ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఐపీఎల్ 2022 కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు కు కోచ్ గా వ్య‌వ‌హ‌రిండానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు కు బ్యాటింగ్ కోచ్ గా ఉండాల‌ని యాజ‌మాన్యం డివిలియ‌ర్స్ ను సంప్ర‌దించార‌ని సమాచారం. దీనికి డివిలియ‌ర్స్ కూడా ఒకే చెప్పాడ‌ని తెలుస్తుంది. కాగ ఏబీ డివిలియ‌ర్స్ ఇటీవ‌లే అన్ని ఫార్మెట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

కాగ ఈ నిర్ణ‌యం తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు అభిమానులు కాస్త అసంతృప్తి గురి అయ్యారు. కానీ ఈ తాజా నిర్ణ‌యం తో డివిలియ‌ర్స్ మ‌ళ్లి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు తో క‌లుస్తాడ‌ని వార్త‌లు రావ‌డం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగ డివిలియ‌ర్స్ బెంగ‌ళూర్ త‌ర‌పున ఇప్ప‌టి వ‌ర‌కు అద్భుతం గా ఆడాడు. అంతే కాకుండా ఆ జ‌ట్టు చాలా విజ‌యాలు అందించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version