తిరుమల శ్రీ వారి భక్తులకు టీటీడీ పాలక మండలి తీపి కబురు చెప్పింది. తిరుమలోని…. వరహస్వామి ఆలయంలో దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఏడాదిన్నర తరువాత భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తోంది టీటీడీ పాలక మండలి. గత ఏడాది మార్చి 20 వ తేదీ నుంచి వరహస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత వేశారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలయంలో దర్శనాలు నిలిపివేసింది టీటీడీ పాలక మండలి. ఇటీవలే వరహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేసింది టీటీడీ పాలక మండలి. మహ సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులును దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. దీంతో ఇవాళ్టి నుంచి శ్రీ వారి భక్తులు వరహ స్వామిని దర్శించు కుంటున్నారు. కాగా.. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా… తిరుమల ఘాట్ రోడ్లు, నడక మార్గాలు ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…ధ్వంసం అయిన రోడ్లు బాగు చేసే పనిలో పండింది టీటీడీ పాలక మండలి.