ఏపీలోని కృష్ణాజిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అవసరాలకోసం ఓ వీఆర్వో కాల్ మనీ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుచేయగా వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే….. ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కొండపల్లి గ్రామ విఆర్వోగా విధులు నిర్వహిస్తున్న గౌస్ వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పు చేశాడు.
అయితే ప్రతి నెలా వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు ఆ వడ్డీ మాపియా సృష్టించింది. అంతే కాకుండా తరచూ ఫోన్ లు చేస్తూ చిత్రహింసలు పెడుతుండటంతో తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో గౌస్ ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.