మొదటి భార్యతో సంసారానికి అడ్డుగా ఉందని.. రెండో భార్యను చంపేశాడు

-

అసలు రెండు పెళ్లిళ్లు చేసుకోవడమే తప్పు. మళ్లీ సంసారానికి అడ్డుగా ఉందని చంపేయడం ఏంటి. మనుషులు రోజురోజుకు ఎంత క్రూరంగా తయారవుతున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. మొదటి భార్యతో సంసారం చేయడానికి అడ్డుగా ఉందని రెండో భార్యను చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్నది.

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన మహ్మద్ సుకూర్ అనే ఆర్‌ఎంపీ డాక్టర్‌కు 12 ఏళ్ల కిందనే పెళ్లయింది. భార్యది రామన్నపేట. అదే గ్రామానికి చెందిన మరో మహిళ షమీనాతో సుకూర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి మొదటి భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. పెద్దలు కూడా మొదటి భార్యతోనే ఉండాలనడంతో మొదటి భార్య దగ్గర ఉంటున్నాడు. దీంతో రెండో భార్య కూడా తనతోనే ఉండాలంటూ సుకూర్‌ను వేధిస్తున్నది. దీంతో ఎలాగైనా రెండో భార్య పీడను వదిలించుకోవాలనుకున్నాడు సుకూర్. ప్లాన్ వేసి రెండో భార్యను ఇంద్రపాలనగరం ప్రాంతానికి రమ్మన్నాడు. తనతో పాటు పెట్రోల్ తీసుకెళ్లి.. ఆమెపై పోసి నిప్పంటించాడు. దీంతో మంటల్లో ఆమె కాలిపోయింది. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు పారిపోయాడు. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version