దారుణం.. 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. తలనరికారు..

-

వారు మనుషులు కాదు.. మృగాలు.. నిజంగా వారికి ఆ పేరు కూడా తక్కువే. ఎందుకంటే.. మృగాలు అయితే కేవలం ఇతర జీవాలను చంపుతాయి. కానీ వారు అంతకన్నా ఎక్కువే చేశారు. ఓ 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు.

వారు మనుషులు కాదు.. మృగాలు.. నిజంగా వారికి ఆ పేరు కూడా తక్కువే. ఎందుకంటే.. మృగాలు అయితే కేవలం ఇతర జీవాలను చంపుతాయి. కానీ వారు అంతకన్నా ఎక్కువే చేశారు. ఓ 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు. ఆమెను తీవ్రంగా హింసించారు. అనంతరం తల నరికారు. ఈ దారుణమైన సంఘటన జంషెడ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ టాటానగర్ రైల్వే స్టేషన్‌లో జూలై 25వ తేదీన రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ తల్లి, ఆమె కుమార్తె (3) నిద్రిస్తున్నారు. అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం జూలై 30వ తేదీన ఆ చిన్నారి తల లేకుండా కేవలం మొండెం మాత్రమే కనిపించింది. టెల్కో ప్రాంతంలో ఆ చిన్నారి మొండాన్ని పోలీసులు గుర్తించారు. కాగా ఆ చిన్నారి తలకోసం డాగ్ స్కాడ్‌తో పోలీసులు గాలించడం మొదలుపెట్టారు.

అయితే ఆ చిన్నారిని అపహరించిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పాత నేరస్థుడేనని, అతని పేరు రింకూయేనని పోలీసులు నిర్దిరాంచారు. ఈ క్రమంలో పోలీసులు రింకూతోపాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. కాగా వారు ఆ చిన్నారిని తీవ్రంగా హింసించి అత్యాచారం చేశారని, ఆపై ఆమె తల నరికారని పోలీసులు తెలిపారు. ఆ బాలిక రహస్య భాగాల్లో తీవ్రమైన గాయాలున్నాయని వారు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version