మ‌రో నిరుద్యోగి.. ఉద్యోగం రాలేద‌ని వివాహిత ఆత్మహ‌త్య

-

ఉద్యోగం రాలేద‌ని వివాహిత ఆత్మ హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. కాగ నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని శాంతి న‌గ‌ర్ కాల‌నీ శ్రీ‌ల‌త (30) త‌న భ‌ర్త సంతోష్ తో నివాసం ఉంటుంది. వీరికి వివాహం అయి దాదాపు 10 సంవ‌త్స‌రాలు అవుతుంది. కాగ సంతోష్ నిర్మ‌ల్ లోనే ఒక ప్రింటింగ్ ప్రెస్ ను న‌డుపుతున్నాడు. కాగ శ్రీ‌ల‌త ఎమ్మెస్సీ బీఎడ్ పూర్తి చేసింది. అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ప‌రీక్ష రాసింది.

ఇటీవ‌ల బ్యాంకింగ్, గురుకులాల్లో కూడా పోటీ ప‌రీక్షలు రాసింది. అయితే ఎందులో కూడా శ్రీ‌ల‌త విజ‌యం సాధించ‌లేక పోయింది. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వ‌డం లేదు. దీంతో ఉన్న‌త చ‌దువులు చ‌దివినా.. లాభం లేద‌ని శ్రీ‌లత తీవ్ర మ‌న‌స్థాపానికి గురి అయింది. దీంతో శుక్ర‌వారం రోజు శ్రీ‌ల‌త ఉరి వేసుకుని ఆత్మ హ‌త్య చేసుకుంది. అయితే కుటుంబ స‌భ్యులు గుర్తించి వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆస్ప‌త్రికి చేరుకునే లోపే శ్రీ‌ల‌త మ‌ర‌ణించింది. కాగ శ్రీ‌ల‌త కు ఒక కుమారుడు, ఒక క‌మార్తె ఉన్నారు. కాగ శ్రీ‌లత తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version