నేడు హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే

-

ఇవాళ హైదరాబాద్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. శ్రీ శ్రీ రామానుజా చార్య సహస్రాబ్ది వేడుకల్లో ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.. పటాన్‌ చెరులోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్స వాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో చేరుకోనున్న మోడీ.. 2 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పటాన్ చెరు వెళ్లనున్నారు.

ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని.. సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ఇక్రిశాట్ లోనే ఉంటారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ఇక్రిశాట్‌ నుండి రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్టు కు మోడీ వెళతారు..

ఎయిర్ పోర్టు నుండి రోడ్ మార్గాన ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరానికి చేరుకోనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొననున్న ప్రధాని… సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక రాత్రి 8 గంటల 40 నిమిషాలకు ఢిల్లీకి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు ప్రధాని మోడీ. అయితే.. ప్ర‌ధాని మోడీ రాష్ట్రం లో ఉన్నంత వ‌ర‌కు సీఎం కేసీఆర్ ఆయ‌న‌తోనే ఉండ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version