BREAKING : కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 60 మంది

-

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. హజ్రత్ గంజ్ అనే ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 60 మంది చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది వెంటనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. దిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ భూకంపం సంభవించడం వల్లే ఈ పాత బిల్డింగ్ కుప్పకూలినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version