హైదరాబాద్‌ లో దారుణం..బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం !

-

దేశంలో కామాంధుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా.. మహిళలపై ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌ లో మరో దారుణం.. ఓ బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం చోటు చేసుకుంది.

బాలిక-అత్యాచారం

మేడ్చల్ జీడిమెట్ల పీఎస్ పరిధిలో గాజులరామారం లో దారుణం జరిగింది. ఓ బ్యూటిషన్ పై ఆమె సన్నిహితుడు..పలుమార్లు అత్యాచారం చేశాడు. బాధితురాల స్నేహితుల ద్వారా పరిచయమైన సంజీవరెడ్డి.. స్టూడియో పెట్టిస్తానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బుధవారం యువతి పుట్టిన రోజు కావడంతో ఇంటికి వెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు సంజీవరెడ్డి. బాధితురాలు ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version