అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున ఓ కంటైనయిర్, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకోవటంతో ఈ ప్రమాదం జరగింది. ఈ ఘటనకు సంబంధించిన స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారు జామున వడోదర దగ్గర్లో పొగ మంచు వాతావరణం ఉంది. అలాంటి చోట.. ఓ లారీ.. సూరత్ నుంచి పావగఢ్‌కు వెళ్తూ.. వడోదర శివారులోని వాగోడియా క్రాస్ రోడ్డు దగ్గర్లో ఉన్న వంతెనపై కంటైనర్‌ను బలంగా ఢీకొంది. పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఆర్తనాదాలు.. అంతా అయోమయం. రోడ్డుపై ట్రాఫిక్ భారీగా స్తంభించిందని తెలిపారు.
ఈ ప్రమాదంలో రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి వాతావరణంలో పొగ మంచు లాంటిది ఉండటం వల్ల రోడ్డు సరిగా కనిపించలేదు. అందువల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చు.. మరొకటి డ్రైవర్ అతివేగం నిద్రమత్తు.. ఒకవేళ లారీ నెమ్మదిగా వచ్చి ఉంటే ఈ ఘోరప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు.. ఏదిఏమైన 10 మంది చనిపోవటం తీవ్ర ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. కొందరు నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మరికొందరు తీవ్రగాయాలతో ఆర్థనాథాలు చుట్టుపక్కలవారిని భయాందోళనకు గురిచేశాయి..మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.. ఆ లారీ కంటైనయిర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి.. వారి స్వస్థలాలు , మృతులు పేర్లు మొదలైన నివేదిక ఇవ్వాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.