జూలై నెల 2న తమకూరు జయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నేలమంగళ పోలీసులు లక్ష్మి, వెంకటేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులు ఇద్దరు దొడ్డలింగప్ప అనే వ్యక్తిని తమకూరులో హత్య చేసి నేలమంగళ తాలూకా కలలుగట్ట బ్రిడ్జి వద్ద శవాన్ని పారవేసి పరారయ్యారు. నిందితులు లక్ష్మీ, వెంకటేష్ హతుడు దొడ్డలింగప్ప అందరూ రాయచూరుకు చెందినవారే. వీరంతా తుమకూరు వద్ద ఉన్న గోశాలలో పనిచేసేవారు.
లక్ష్మీ మొదటి భర్త మృతి చెందగా, రెండవ భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో లక్ష్మి, దొడ్డలింగప్ప, వెంకటేష్ అనే ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే దొడ్డలింగప్ప తో అక్రమ సంబంధం గురించి వెంకటేష్ కు తెలుసు.
కానీ, వెంకటేష్ తో అక్రమ సంబంధం ఉన్న సంగతి దొడ్డలింగప్ప కు తెలీదు. దొడ్డలింగప్ప కు లక్ష్మి 30000 డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వెంకటేష్ తో ఉన్న సంబంధం తెలిస్తే గొడవ చేస్తాడని భావించిన లక్ష్మి జూలై 2న అతడి అతడిని ఇంటికి పిలిపించి, మద్యం తాగించి తలపై బండరాయితో బాది హత్య చేసింది. ఇందుకు వెంకటేష్ సహకరించాడు. శవాన్ని తీసుకువచ్చి నేలమంగళ వద్ద బ్రిడ్జి కింద పారవేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.