సెక్స్‌ వర్కర్లను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ లో వ్యభిచారం..ఒక్కరికి రూ. 3 వేలు !

-

హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్ రోడ్ no5 లో వ్యభిచారం గుట్టు రట్టైంది. జూబ్లీహిల్స్ రోడ్ no5 లోని శ్రీ పద్మావతి నిలయం అపార్ట్ మెంట్స్ లో గల సీజన్ 4 స్పా లో గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. అయితే.. పక్కా సమాచారం రావడంతో సోమవారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.

రూ.3 వేలు చెల్లిస్తే సెక్స్ వర్కర్ కోరిన సేవలను అందిస్తుందని అక్కడ మేనేజర్ చెప్పడంతో ఆ మేరకు డబ్బు చెల్లించి లోనికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఇద్దరు కస్టమర్లతో సెక్స్ వర్కర్లు వ్యబిచారం చేస్తున్న విషయాన్ని బయట ఉన్న పోలీసులకు సమాచారం అందించారు.

మహిళా పోలీసుల సాయంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకురాలు మీరా సేన్ అలియాస్ సౌమ్య (30) తో పాటు రిసెప్షనిస్ట్ సరిత(42), ఇద్దరు కస్టమర్లు జిలానీ, సుబ్రమణ్యం లను అరెస్ట్ చేసారు. అక్కడ ఉన్న 7 మంది సెక్స్ వర్కర్స్ ను కాపాడి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version