12 ఏళ్ల బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. ఈ దారుణమైన సంఘటన రాజస్థాన్ లో చోటు చేసకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని కోట ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల గిరిజన బాలిక రోజులాగే పాఠశాలకు వెళ్లింది.
అక్కడ కళ్లు తిరిగి పడిపోవడం వల్ల ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా.. ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక తండ్రి 12 ఏళ్ల కిందే మరణించాడు దీంతో మతిస్తిమితం లేని తన తల్లితో కలిసి తాతయ్య వద్ద ఉంటోంది బాలిక.
కాగా.. మద్యానికి బానిసైన బాలిక తాతయ్య రూ.500 కోసం ఆమెపై లైంగిక దాడికి ప్రోత్సహించాడు. దీంతో రామ్ లాల్ భీల్ అనే 50 ఏళ్ల వ్యక్తి కొన్ని నెలలుగా లైంగిక దాడి చేశాడు. మరో నిందితుడు 20 ఏళ్ల అజయ్ భైరవ… గత ఆరు నెల్లలో అనేక సార్లు లైంగిక దాడికి చేశారు. ఈ విషయం బయట పెడితే.. చంపేస్తామని బెదిరించారు. అయితే.. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. వారిపై కేసు నమోదు చేశారు.