తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

-

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలి తీసుకుంది. తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర ఓ ఆర్టీసీ బస్సు.. సుమోను ఢీ కొట్టింది. సింగం బైపాస్ పై సుమోను.. బస్సు ఢీ కొట్టింది. దీంతో సూమోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలియడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని పండుగ వేళలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ వాహనదారులు మాత్రం ఏవేమి పట్టనట్టుగా అధిక వేగంతో ఒకరినీ మించి మరొకరూ పోటీగా వెళ్తున్నారు. ఇలా వెళ్లడంతో చాలా వరకు ప్రమాదాల బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇకనైనా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version