ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2012 నాటి నిర్భయ హత్యాచారం కేసు ఇంకా కళ్లముందే తిరుగుతూ ఉంది. దేశమంతా ఆమెకు జరిగిన అన్యాయంపై గళమెత్తింది. నిందితులకు శిక్షపడాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. దీంతోనిందితులకు ఉరి శిక్షను ఖరారు చేశారు. కానీ ఏడేళ్లు గడిచినా నిందితులకు శిక్ష మాత్రం పడలేదు. ఇక ప్రస్తుతం ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా నలుగురు దోషులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో నిర్భయ దోషులను ఉరి తీసేదెప్పుడు..? క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించిన ఇద్దర్నీ పక్కనబెట్టి మిగతా ఇద్దరు దోషులను ముందుగా ఉరి తీస్తారా? లేదంటే అందర్నీ కలిపి ఒకేసారి ఉరి తీస్తారా? ఈ ప్రశ్నలకు నేడు (బుధవారం) ఢిల్లీ హైకోర్టు తీర్పు రూపంలో సమాధానం వచ్చింది.
నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారుల నిర్ణక్ష్యం వల్లే రకరకాల పిటిషన్లు తెరపైకి వచ్చాయని ఢిల్లీ హైకోర్డు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దోషుల ఉరిశిక్షపై వారం రోజులు గడువు వచ్చింది. ఈలోపు న్యాయపరమైన అవకాశాలను పూర్తి చేసుకోవాలని సూచింది. అలాగే నలుగురిని ఒకేసారి ఉరి తీయాలని తీర్పును వెల్లడించింది.