మ‌రో ప్రాణాన్ని బ‌లి తీసుకున్న టిక్‌టాక్‌.. ఏం జ‌రిగిందంటే..?

-

టిక్‌టాక్‌ చాలామందికి ఇప్పుడిదో వ్యసనం. రోజుకు ఒక్క టిక్‌టాక్ వీడియో చేయనిదే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. . యువతీయువకుల్లో టిక్‌టాక్ వీడియోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ టిక్‌టాక్ వ‌ల్ల ఎంద‌రో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజాగా మ‌రో యువ‌కుడు ఈ టిక్‌టాక్ వ‌ల్ల బ‌లైపోయాడు. కువైట్‌లో ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడుకు చెందిన పుచ్చకాయల మోహన్‌కుమార్ (30) రెండేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు.

అక్కడ ఓ దుకాణంలో పనికి కుదిరాడు. సంపాదించిన సొమ్ములో కొంత చిట్టీ కడుతున్నాడు. ఇటీవల ఆ చిట్టీని పాడుకున్నాడు. అయితే, చిట్టీ పాడుకున్న మోహన్ ఆ డబ్బు తీసుకుని కనిపించకుండా పోయాడంటూ అతడి స్నేహితులు కొందరు మోహన్ ఫొటోలతో ఓ వీడియో తయారుచేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు. అది చూసి తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్ ఈ నెల 3న తాను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ మృతదేహం నిన్న స్వగ్రామం చేరుకుంది. మోహన్ ఆత్మహత్యపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version