స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు..

-

గ‌త మూడు రోజులుగా భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు ఈ రోజు స్థిరంగా నిలిచాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగా ఉంది. దీంతో పది గ్రాముల ధర 39,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 36,300 రూపాయల వద్ద ఉంది. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి 48,650 రూపాయల వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ఎటువంటి మార్పులకూ లోనవలేదు. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,320 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా మార్పులు లేకుండా 37,050 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా యధాతథంగా కేజీకి 48,650 రూపాయలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version