వనస్థలిపురంలో దారుణం..కన్న కూతుళ్లపై తండ్రి లైంగికదాడి

-

హైదరాబాద్ : వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతుళ్లపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన.. బాధితులు చెప్పే వరకు బయట పడలేదు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా దేవర కొండకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కుటుంబం.. వనస్థలిపురంలో నివాసం ఉంటుంది. ఈ ఆటో డ్రైవర్‌ కు.. ఐదురుగు సంతానం. అందులో ఇద్దరు మగవాళ్లు కాగా.. ఇద్దరు ఆడవాళ్లు. అయితే.. ఆటో డ్రైవర్‌ మద్యం బాగా తాగుతాడు.

ఈ నేపథ్యంలోనే.. తన భార్య లేని సమయంలో.. కన్న కూతుళ్లపై తండ్రి లైంగిక దాడికి ప్రయత్నించాడు. రోజూ మద్యం తాగొచ్చి కూతుళ్లను వేధించిన కసాయి తండ్రి.. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. అయితే.. ఈ ఘటన జరుగడంతో.. మిగతా కూతుళ్లు అరిచారు. దీంతో ఆ కసాయి తండ్రి.. ఇంటి నుంచి పరార్‌ అయ్యాడు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ నిందితుని కోసం పోలీసులు.. గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version