వీడియో వైరల్: దేవుడా ఇదేం మ్యాజిక్… ఏకంగా సిగ‌రెట్లునే తినేస్తున్నాడు..!!

-

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక వీడియో వైరల్ గా మారింది. సాధారణంగా మ్యాజిక్ అంటే మనం చిన్న చిన్న మ్యాజిక్ లు చూస్తూ ఉంటాం. కానీ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అసలు ఇంతకీ ఈ వీడియో లో ఏముంది..? ఏమి చేస్తున్నారు అనే విషయం లోకి వెళితే…

 

మామూలుగా మనం ఎన్నో మ్యాజిక్స్ ని చూస్తూ ఉంటాం. అయితే ఆ మ్యాజిక్ ని మనం చూసి దాని వెనుక లాజిక్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాము. కొందరైతే ఆ మ్యాజిక్ అసలు ఎలా చేశారు అబ్బా అని తెలుసుకోవాలని ఆత్రుత పడుతుంటారు. సోషల్ మీడియా లో టామ్ ముల్లికా అనే ఒక మెజీషియన్ సిగరెట్లు తాగుతూ నోట్లోంచి.. చెవుల్లోంచి.. ముక్కులో నుండి సిగరెట్ పొగను బయటకి తీస్తున్నాడు.

ఇలా ఈ మెజీషియన్ సిగరెట్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. మరో మూడు సిగరెట్లు ఒకేసారి తాగుతూ నోట్లోకి మింగేస్తాడు. మళ్ళీ కొన్ని సిగరెట్లు తీసుకుని లైటర్ తో వెలిగిస్తాడు. అలానే నోట్లోకి మింగిన సిగరెట్లను మళ్లీ బయటికి తీస్తాడు. ఇలా సిగరెట్లతో ఈ వ్యక్తి మ్యాజిక్ చేసాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ షికార్లు కొడుతోంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version