తండ్రి కాదు వీడు.. కూతురును బ్లేడుతో కోసి.. కొడుకును నీటితొట్టిలో పడేసి

-

తండ్రి అంటే ఎలా ఉండాలి. తన పిల్లల పాలిట దేవుడిలా ఉండాలి. తండ్రిని చూసి పిల్లలు మురిసిపోవాలి. తండ్రి పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. కానీ.. ఈ తండ్రి మాత్రం ఆ పిల్లల పాలిట యముడయ్యాడు. కసాయిలా ప్రవర్తించి సొంత బిడ్డలనే కడతేర్చాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాలో చోటు చేసుకున్నది.

కుటుంబ కలహాలతో ధనోజిరావు అనే వ్యక్తి భార్య అతడిని, ఇద్దరు పిల్లలు మధు, లిఖితను వదిలేసి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడాన్ని అవమానంగా భావించి.. భార్య మీద కసితో కన్న బిడ్డలను కడతేర్చాడు. కూతురు గొంతును బ్లేడుతో కోశాడు. కొడుకును నీటితొట్టెలో పడేసి చంపేశాడు. అచేతనంగా పడి ఉన్న పిల్లలను చూసిన స్థానికులు ఆ తండ్రిపై దుమ్మెత్తిపోశారు. పసిపిల్లలను చంపడానికి అతడికి మనసెలా వచ్చిందని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version