త్వరలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని కీలక ప్రకటన చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంపుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వాకం అని ఆగ్రహించారు. త్వరలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు.
జగన్ అరాచక దోపిడీ వలన రాష్ట్రానికి ఈ దుస్థితి అని ఫైర్ అయ్యారు. జగన్ వేల వాగ్దానాలు చేసి వందల వాగ్దానాలు అమలు చేయలేదన్నారు. వైసిపి పై నమ్మకం లేక నేతలంతా వలస పోతున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి పట్ల అసంతృప్తి ఉంటే ఎందుకు జాయినింగ్ అవుతారన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య.