వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. 150 షాపులకు వ్యాపించిన మంటలు

-

అసోంలోని జోర్హాట్​లోని చౌక్ బజార్​లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అవికాస్త పక్కనే ఉన్న షాపులకు వ్యాపించాయి. మొత్తం 150 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 25 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పివేశారు.

మంటలు వేగంగా మార్కెట్‌ మొత్తానికి విస్తరించాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. వేగంగా వ్యాపించడం వల్ల ఆర్పేసే అంతలోగనే దుకాణాలు దగ్ధమయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనతో భారీ ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. షాపులు మూసిన తర్వాత ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

కాలిపోయిన వాటిలో ఎక్కువగా బట్టలు, నిత్యావసరాలకు చెందిన దుకాణాలే ఉన్నాయని వెల్లడించారు. మంటలను అదుపుచేయడానికి జోర్హాట్‌ సమీపంలో ఉన్న పట్టణాల నుంచి ఫైర్‌ ఇంజిన్లను రప్పించామన్నారు. రోడ్లు ఇరుకుగా ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news