రజనీకాంత్ ఒక్కరోజు పారితోషకం ఎన్ని కోట్లంటే..?

-

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ వయసు పైబడుతున్నప్పటికీ వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారని చెప్పవచ్చు. గతంలో కొన్ని సినిమాలతో వెనుకబడినప్పటికీ ఆయన క్రేజ్ ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గలేదు. ఫ్లాపులు వచ్చినా సరే రజనీకాంత్ క్రేజ్ మాత్రం బాషా రేంజ్ లో దూసుకుపోతోంది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్.. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన చాలా అప్డేట్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇంకొక వైపు ఈ సినిమాల్లో సౌత్ ఇండియా రాష్ట్రాలలోనే కాదు బాలీవుడ్ లో కూడా ఒక్కొక్క రాష్ట్రం నుండి ఒక్కొక్క నటుడిని తీసుకోబోతున్నట్లు సమాచారం. సునీల్ తో పాటు తదితర నటీనటులు ఈ సినిమాలో నటించబోతున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ తన రేంజ్ను బట్టి ఈ సినిమా కోసం రూ.140 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ నటించబోయే మరొక సినిమా లాల్ సలాం.

ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు.. అయితే ఏడు రోజులకు కాల్ షీట్లు ఇచ్చినట్లు సమాచారం . ఈ ఏడు రోజులకు గాను ఆయన సుమారుగా రూ. 25 కోట్ల పారితోషకం డిమాండ్ చేశారట. కానీ రజనీకాంత్ ఇమేజ్ ను బట్టి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రజినీకాంత్ ఒక్కరోజు పారితోషకం రూ.3.5 కోట్లు అని స్పష్టమవుతుంది. ఇది చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news