ముంబైలో ఒక దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్టీ చేసుకుందామంటూ పిలిచి ఒక యువతి పై సామూహిక అత్యాచారం చేశారు. పార్టీ ఆహ్యానించిన స్నేహితులే బలత్కారం చేసిన ఘటన నవంబర్ 8న ముంబాయిలో చోటు చేసుకుంది. సెంట్రల్ ముంబైకి చెందిన అవినాశ్ పంగేకర్ (28) కు కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో స్నేహితులందరికీ పార్టీ ఇద్దామనుకున్నాడు. ఇద్దరు యువకులను, మరో ముగ్గురు యువతులను పార్టీకి ఆహ్వానించాడు. అంధేరీలో- కర్లా రోడ్డులో గల హోటల్లో పార్టీ చేసుకున్నారు. అంత బాగానే జరిగింది. పార్టీ ముంగించిన అనంతరం అవినాశ్ పంగేకర్( 28), శిశిర్ (27), తేజస్ (25)లు బాధిత యువతి (22) పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన తర్వతా ఆమెను అక్కడే వదిలేసి నిందితులు హోటల్ నుంచి పరారయ్యారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే విధంగా బాధితురాలిని కూపర్ ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అత్యాచార బాధితులు ఎవరైన నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. యువతీకు కౌన్సీలింగ్ ఇచ్చి, మానసక నిపుణుల సూచనల ప్రకారం చికిత్స అందిస్తామని పోలీసులు తెలిపారు.