పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు..నేర చరిత్ర ఉన్న వారికే రాజకీయాలు !

-

వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నాడు నేడు ముగింపు పాదయాత్ర బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేర చరిత్ర ఉన్న వారికి రాజకీయాలు బాగా పనికొస్తున్నాయని, అక్రమ సంపాదన రాజకీయం మార్గం అయిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయన్న సుభాష్ చంద్రబోస్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఇక తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాయటం కూడా సంచలనంగా మారింది. దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని హోం మంత్రిని కోరారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. అది మరువక ముందే ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా చేయడంతో మళ్ళీ ఆయన జిల్లాలో చర్చనీయాంశంగా మారారు.అయితే ఈ కామెంట్స్ తోట త్రిమూర్తులుని ఉద్దేశించినవేనని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version