ఐపీఎస్ పేరు తో మ‌హిళ‌కు వేదింపులు.. కేసు న‌మోదు

-

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఐపిఎస్ అధికారి పేరుతో మహిళకు వేదింపులు చేసిన యువ‌కున్ని రాచ‌కుండా పోలీసులు అరెస్టు చేశారు. హ‌రి ప్ర‌సాద్ అనే యువ‌కుడు మాట్రిమోని అనే సైట్ లో తాను ఒక ఐపీఎస్ అధికారి ని అంటూ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఐపీఎస్ అధికారి అని ప్రొఫైల్ క‌నిపించ‌డంతో కొంత మంది మ‌హిళ‌లు ఆసక్తి కనబర్చారు. దీంతో ఆయా మహిళలను హ‌రి ప్ర‌సాద్ ట్రాప్ చేస్తున్నారు.

అయితే ఒక యువ‌తి కి అనుమానం రావ‌డం తో ఐడీ కార్డు చూపించమంది. దీంతో ప్రసాద్ నకిలీ ఐడి కార్డ్ క్రీయెట్ చేశాడు. అలాగే ఆ యువ‌తి ని త‌ర‌చూ వేధించ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో బాధిత మ‌హిళ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాచ కొండ పోలీసులు రంగం లోకి దికి హ‌రి ప్ర‌సాద్ ను అరెస్టు చేశారు. హ‌రి ప్ర‌సాద్ ఫేక్ ఫ్రొఫైల్ ను క్రియెట్ చేసి ఎంత మంది మ‌హిళ ల‌ను వేధించాడు.. అని రాచ కొండ పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version