దిల్లీలో రూ. 1200 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం

-

దిల్లీ పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్ ను చేధించారు. రూ.1200 కోట్లు విలువ చేసే దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను దిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్‌) ఉండటం గమనార్హం. మరో 10కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు నడిపిస్తున్నట్లు తెలిపారు.

అఫ్గానిస్థాన్‌కు చెందిన ముస్తాఫా స్టానిక్జా (23), రహీముల్లా రహీమ్‌ (44) 2016 నుంచి భారత్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచే డ్రగ్స్‌ రాకెట్‌ను నడిపిస్తున్నట్టు పోలీసులుగుర్తించారు. విదేశాల్లో తయారుచేసిన ఈ మెథ్‌ను దిల్లీకి తీసుకువస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. దిల్లీలోని కాలిందికుంజ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఆ ట్రక్‌ను స్వాధీనం చేసుకొని వీరిద్దరినీ అరెస్టు చేశారు. నిందితుల ఇళ్ల వద్ద కూడా సోదాలు చేశామని, డ్రగ్స్‌ తయారీకి వినియోగించే కొన్ని నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కమిషనర్ హరగోబిందర్ సింగ్ ధాలివాల్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version