ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల కూడా పాల్గొంటున్నారు. తన అన్న జగన్ తరుపున షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్రం కూడా చేయాలని వాళ్లు ఆలోచిస్తున్నారు.
ఇది ఎన్నికల సీజన్. దేశం మొత్తం ఎన్నికల మీదే చర్చ. దేశమంతా ఎన్నికల హడావుడి ఉంటే సోషల్ మీడియాలో వేరే ఉంటదా? ఉండదు కదా. సోషల్ మీడియాలో కూడా ఎన్నికలపైనే నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే.. సోషల్ మీడియా విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఈసీ కూడా ఇదివరకే చెప్పింది. సోషల్ మీడియాలో ఏది షేర్ చేసినా.. కామెంట్ చేసినా.. అది త్వరగా జనాల్లోకి వెళ్తుంది. దాని వల్ల ఓటర్లపై, రాజకీయ పార్టీలపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో అంతా తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నెటిజన్లు కూడా కాస్త ఆచీతూచీ వ్యవహరించాలి అని చెబుతూనే ఉన్నారు.
అయినా కూడా ఓ వ్యక్తి ఆవేశపడ్డాడు. వైఎస్ జగన్ సోదరి షర్మిలపై ఘాటుగా కామెంట్లు చేశారు. ఆమెపై అసభ్యకర కామెంట్లు చేశాడు. యూట్యూబ్ లో షర్మిలపై చేసిన ఆ కామెంట్లు షర్మిల కంట పడ్డాయట. ఆమెను కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని… హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కామెంట్ల ద్వారా కంప్యూటర్ ఐపీని కనిపెట్టారు. ఐపీ అడ్రస్ ప్రకారం.. ఆ వ్యక్తి 39 ఏళ్ల హరీశ్ చౌదరిగా గుర్తించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్.. చౌటుప్పల్ కు సమీపంలో ఉన్న ఓ ఫార్మాసూటికల్ సంస్థలో పనిచేస్తున్నాడట. వెంటనే అతడిని పోలీసులు చౌటుప్పల్ లో అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల కూడా పాల్గొంటున్నారు. తన అన్న జగన్ తరుపున షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్రం కూడా చేయాలని వాళ్లు ఆలోచిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆ వ్యక్తి షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.