పాఠశాలలో విద్యార్థినిని రెండవ అంతస్తు నుండి కిందకు తోసేసింది తోటి విద్యార్థి. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ చోటు చేసుకుంది. విద్యార్థినిని రెండవ అంతస్తు నుండి కిందకు తోసేసింది తోటి విద్యార్థి. 14 సంవత్సరాల బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. పాడిపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థి స్నేహగా గుర్తింంచారు.
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థికి గోప్యంగా వైద్య చికిత్స అందిస్తోంది స్కూల్ యాజమాన్యం. ఇక ఈ ప్రమాద ఘటనపై ఆసుపత్రికి చేరుకుని విచారించారు తిరుపతి అర్బన్ తహసిల్దార్. ఈస్ట్ పోలీసులకు సమాచారం అందడంతో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.