పారాణి ఆరక ముందే భర్తను హత్య చేసింది నవ వధువు. కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఈ దారుణం జరిగింది. మృతుడు తెలంగాణలోని గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ గా గుర్తించారు పోలీసులు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి, ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ కలిసి తేజేశ్వర్ ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బ్యాంక్ మేనేజర్, ఐశ్వర్య ఫోన్లను ట్రేస్ చేసి వివరాలు సేకరించారు పోలీసులు. ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐశ్వర్య, అత్త సుజాత ఉన్నారు. అటు పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.