బాలురపై అత్యాచారం, లైంగిక దాడుల ఘటనలు మన దేశంలో హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరుగుతుండడం ఆందోళనకరమైన అంశంగా మారింది. ఈ ఏడాది కాలంలో పోక్సో చట్టం కింద మొత్తం 1093 కేసులు నమోదు అయ్యాయి.
అత్యాచారాలు, లైంగిక దాడులనేవి కేవలం మహిళలు, యువతులు, బాలికలపైనే జరుగుతున్నాయని నిజానికి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అది వాస్తవమే అయినప్పటికీ బాలురు కూడా ఎక్కువగానే లైంగిక దాడులకు గురవుతున్నారట. అవును, మీరు విన్నది నిజమే. మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలోనే ఈ తరహా ఘటనలు గత కొంత కాలంగా చాలా జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు బాలుర తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర నిర్మానుష్య ప్రదేశాలు, నివాసాల వద్ద ఎక్కువగా బాలురు లైంగిక దాడులకు, అత్యాచారాలకు గురవుతున్నారట. అయితే ఈ తరహా ఘటనలు జరిగినా వాటి గురించి బయటకు చెబితే తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో బాలుర తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారట. దీంతో ఘటన జరిగినా దాన్ని ధైర్యంగా చెప్పేవారు లేక.. ఇలాంటి పనులు చేసే వారిపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి కూడా కష్టతరంగా మారింది.
బాలురపై అత్యాచారం, లైంగిక దాడుల ఘటనలు మన దేశంలో హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరుగుతుండడం ఆందోళనకరమైన అంశంగా మారింది. ఈ ఏడాది కాలంలో పోక్సో చట్టం కింద మొత్తం 1093 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే తమ పిల్లలను కొందరు వ్యక్తులు దగ్గరకు తీసి, చాకెట్లు, బిస్కట్లు అని మభ్యపెట్టి వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి వారిపై అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడుతున్నారని.. బాలుర తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా భారత ప్రభుత్వం చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం 2007లో 53.2 శాతం మంది పిల్లలు లైంగిక దాడికి గురి కాగా వారిలో 52.9 శాతం మంది బాలురే ఉండడం మరింత ఆందోళనను కలగజేస్తోంది. ఈ క్రమంలోనే ఈ తరహా ఘటనలను నివారించేందుకు ప్రజల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించాలని, శృంగార పరంగా సంక్రమించే వ్యాధుల పట్ల కూడా ప్రజల్లో అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.