మాజీ మంత్రి నారా లోకేష్ సినీ రంగం వైపు చూస్తున్నారట. త్వరలోనే ఆయన సినీ నిర్మాతగా అవతారం ఎత్తనున్నారని తెలిసింది. ఇకపై సినిమా రంగంలోనే నారా లోకేష్ బిజీగా ఉండబోతున్నారని సమాచారం.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇప్పుడేం చేయాలో తెలియక ఓ వైపు మాజీ సీఎం చంద్రబాబు తలపట్టుకుని కూర్చుంటే.. మరోవైపు ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మాత్రం సినీ రంగం వైపు చూస్తున్నారట. త్వరలోనే ఆయన సినీ నిర్మాతగా అవతారం ఎత్తనున్నారని తెలిసింది. ఇకపై సినిమా రంగంలోనే నారా లోకేష్ బిజీగా ఉండబోతున్నారని సమాచారం.
మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ కు ఇప్పుడు పెద్దగా పనిలేదట. ఎందుకంటే.. ఇప్పుడు ఎలాగూ వారి పార్టీ అధికారంలో లేదు. అలాగే పార్టీ కార్యకలాపాలను కూడా చంద్రబాబే స్వయంగా చూసుకుంటున్నారు. మరిక నారా లోకేష్‌కు పనేముంటుంది చెప్పండి. అందుకనే ఖాళీగా ఉండకుండా కనీసం ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను తీస్తేనైనా కాసిన్ని డబ్బులు సంపాదించుకోవచ్చని నారా లోకేష్ అనుకున్నారట. అందుకనే ఆయన త్వరలో సినీ నిర్మాతగా మారుతారని కూడా టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.
నందమూరి వంశంలో చాలా మంది సినీ రంగంలో ఉండడం, మరోవైపు మామ బాలకృష్ణ, సోదరుడు నారా రోహిత్‌లు హీరోలుగా ఉండడంతోపాటు టీడీపీకి పలువురు సినీ ప్రముఖులు అండగా కూడా ఉన్నందున సినీ రంగం అయితే బెటరని భావించిన నారా లోకేష్ సినీ నిర్మాతగా మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అందుకనే ఆయన త్వరలో వరుసపెట్టి సినిమాలను తీస్తారని కూడా జోరుగా ప్రచారం కొనసాగుతోంది. మరి నారా లోకేష్ నిజంగానే సినీ నిర్మాత అవుతారా ? అయితే కనీసం ఆ రంగంలోనైనా రాణిస్తారా ? అన్న వివరాలు తెలియాలంటే.. మరికొంత కాలం వేచి చూడక తప్పదు..!