సంజన డ్రగ్స్ కేసు.. మిస్టరీ అదే..

-

సినిమా ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. చాలా మంది సెలెబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారనీ, డ్రగ్స సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఐతే బుజ్జిగాడు ఫేమ్ సంజన, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంజన అరెస్ట్ అయిన దగ్గరి నుండీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఐతే సంజనాని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెకి డ్రగ్స్ కేసులో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సంబంధాలున్నట్టు ఆధారాలు వెతికే పనిలో ఉన్నారు. ఐతే ఇప్పటి వరకూ అలాంటి ఆధారాలు కనిపించలేదట. ఆమె మొబైల్ ఫోన్ కూడా దీనికి సంబంధించిన అంశాలేవీ లేదని తెలుస్తోంది.

అదలా ఉంటే, సంజనాకి అంత ఆస్తులు ఎలా వచ్చాయన్నదే మిస్టరీగా మారింది. సినిమాల్లోనూ పెద్దగా ప్రభావం చూపించని హీరోయిన్ కి ఆని ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ఆస్తులు వివరాలపై విచారణ ప్రారంభించారు. అక్కడి నుండైనా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version