పర్యాటక ప్రాంతమైన గోవాలో పెను విషాదం చోటుచేసుకుంది. గోవాలోని ఓ ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో ఏకంగా ఏడుగురు భక్తులు మరణించారు. ఈ సంఘటన తాజాగా జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీగావ్‌లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతి చెందారు.

మరో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆలయంలో జాతర జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అటు అధికారులు ఈ సంఘనత పై విచారణ చేస్తున్నారు.
- ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..!
- గోవా-శ్రీగావ్‌లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట
- ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లుగా సమాచారం
- మరో 30 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది
- మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది