అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

అమెరికా లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం లో తెలంగాణ లో ని సూర్యాపేట్ జిల్లా వాసి మృతి చెందాడు. ఈ రోడ్డు ప్ర‌మాదం అమెరికా లో ని ఒహ‌యో రాష్ట్రం లో జ‌రిగింది. కాగ చిరు సాయి అనే యువకుడు ఈ ప్ర‌మాదం మృతి చెందాడు. సూర్యాపేట్ కు చెందిన‌ చిరు సాయి అమెరికా లో ని ఒహ‌యో రాష్ట్రం లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఉద్యోగం ముగించు కుని కారు లో ఇంటి కి వ‌స్తున్న స‌మ‌యం లో టీప్ప‌ర్ కారు ను ఢీ కొట్టింది.

అయితే అమెరికా లో ప్రస్తుతం శీతకాలం కావ‌డం తో విప‌రీతం గా మంచు కురుస్తుంది. దీంతో టిప్ప‌ర్ వేగంగా వ‌చ్చి కారు ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదం లో సూర్యాపేట్ కు చెందిన చిరు సాయి అక్క‌డికి అక్క‌డే మృతి చెందాడు. అలాగే చిరు సాయి కారు లో ఉన్న మ‌రొక్క వ్య‌క్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అత‌ను కోమా లోకి వెళ్లాడు. అయితే రోడ్డు ప్ర‌మాదం లో మ‌రణించిన చిరు సాయి మృత దేహాన్ని భార‌త దేశానికి తీసుకు రావ‌డానికి కుటుంబ స‌భ్యులు తీవ్రం గా ప్ర‌య‌త్ని స్తున్నారు.